553..
మరపువీణ తంత్రులపై ~ మరులుపోవు వేళలివే..!
ఛత్రమైన వెలుగుమబ్బు ~ వెంట నడచు వేళలివే..!
అసలు నిప్పు ఎదలోయల ~ పూలతోట ఒకటున్నది..!
కాల్చు మోహ వనసీమకు ~ స్వస్తి పలుకు వేళలివే..!
కా'మనలను కవ్వించే ~ కల్పతరుల సొగసుకేమి..?!
పలకరించు కలహాలను ~ నిలువరించు వేళలివే..!
మరబొమ్మగ బ్రతుకులీడ్చు~ కలలగగన సంద్రంలో..
కాగితాల పడవలనే ~ సంస్కరించు వేళలివే..!
చూడ నిలువుటద్దంలా ~ ఉంది కదా..నీ మనసే..!
మసిబారిన శిల్పలతను ~ శుభ్రపరచు వేళలివే..!
నిజ మధువుల పుట్టిల్లే ~ నీదు మురళి 'మాధవుడా..'!
జగతి విషయ వాసనలను ~ పరిహరించు వేళలివే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు