@31-12-15..ముషాయిరా గజల్-1..// 556 //
ఏ వెన్నెల రేయి కూడ..హాయిలేదు ఎందుకనో..!?
మధుమాసపు పరిమళాల మత్తు'లేదు ఎందుకనో..?!
భ్రమల కొలువుకూటంలో..ఎన్నిసార్లు పుట్టానో..?!
బ్రతుకుబాట తోడయ్యే చెలియలేదు..ఎందుకనో..!?
నీడలాగ తానున్నా నిదుర రాదు నా కంటికి..
చెలుని మనసు తెలిసేందుకు తెలివి లేదు ఎందుకనో..!?
నీతోనే ఉండాలని ఎన్ని కలలు కన్నానో..?!
ఇంతకన్న వేరే మరి ఆశలేదు ఎందుకనో..?!
ఏమి మాయ చేసావో..ఊపిరికే ఊపిరివా..!
ఏ వేళా నీవు గాక..ధ్యాస లేదు ఎందుకనో..!?
నీ చెలిమిని సుఖమేదో పొందాలని అనుకున్నా..
కన్నులెత్తి నీవు నన్ను చూడలేదు ఎందుకనో..!
మాధవుడా..చూడకలా దొంగలాగ చెప్పకుండ..
నీవు లేక యమున అసలు నవ్వలేదు ఎందుకనో..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు