563..
చినుకుపూల నవ్వులలో..కురియు వెన్నెలెంత హాయి..!
చెలివలపుల పిలుపులలో..ముసురు వెన్నెలెంత హాయి..!
నన్ను నేను తెలియలేక..పరుగులెన్ని పెడతానో..?!
పరిమళించు చూపులలో..పండు వెన్నెలెంత హాయి..!
కలహంసల నేలు సఖియ..కలత తీర్చు వేళలలో..
తెలిమబ్బుల గుంపులలో.. నిండు వెన్నెలెంత హాయి..?!
నెలరాజును అలరించే..కలువబాల మురిపాలకు..
జతకలిసే సిగ్గులలో..ఒలుకు వెన్నెలెంత హాయి..!
విరహాలను తొలగించే..విరజాజుల ఎదలోయల..
విరబూసే తలపులలో..కాయు వెన్నెలెంత హాయి..!
ప్రతి సంధ్యన ఆ'రాధను..పూజించే 'మాధవు'డా..!
బృందావన వీధులలో.. చిందు వెన్నెలెంత హాయి..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు