@గజల్ మహల్ 01-1.// 565 //
నీ నవ్వుల మధుపాత్రను ~ రువ్వినావు చిత్రముగా..!
నీ వలపుల యేటి ఒడ్డు ~ నిలిపినావు చిత్రముగా..!
నీదు లేత పరువాలకు ~ అద్దమాయె ఈ వనమే..!
కనిపించక అలరించగ ~ నిలచినావు చిత్రముగా..!
నీ తియ్యని చూపులు నను ~ బందీనే చేసినాయి..!
వసంతాల సోయగమై ~ నిండినావు చిత్రముగా..!
నెలరాజును మురిపించే ~ గగనమంటి చినదానా..!
సంప్రదాయ సుందరిగా ~ చేరినావు చిత్రముగా..!
ఉన్నాగా నీతోనే ~ అని పాడే నవ మోహిని..!
సమ్మోహన గీతికగా ~ మిగిలినావు చిత్రముగా..!
ఆ 'మాధవ' ఆ'రాధవె ~ నన్నెందుకు ఉడికింతువు..?!
పసిడివన్నె జవరాలిగ ~ దక్కినావు చిత్రముగా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు