// 570 //
ప్రతి క్షణమొక మధుపాత్రగ..నిలిపినావు..మాటలేల..?!
నా శ్వాసకు మౌనసుధగ..నిలచినావు..మాటలేల..?!
నీ తలపుల మధుశాలను..వీడేందుకు వీలు లేదు..!
ప్రతి కలనొక కలహంసగ..మలచినావు..మాటలేల..?!
ఆ మబ్బుల మాటునుండి..ఎందుకలా నవ్వేవో..!?
ప్రతి ఆశను హరితలతగ..మార్చినావు..మాటలేల..!?
నీ అందెల రవళులతో..జాబిలినే మురిపింతువు..!
ప్రతి చినుకును నవకవితగ కురిసినావు మాటలేల..!?
సెలయేరుల పయ్యెదలను..సరికొత్తగ సవరింతువు..!
ప్రతి కణమును వర వీణగ..చూపినావు మాటలేల..!?
సప్తవర్ణ రధమేదో..బహుమతిడిన 'మాధవు'నకు..
ఈ జగమును..ఆ'రాధగ..చేసినావు మాటలేల..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు