576 //
నా మనసే పూలసెజ్జ నీకివ్వగ వస్తున్నా..!
నీ వాల్జడ సొగసులనే కాజేయగ వస్తున్నా..!
నీ ఒయ్యారం చూసేందుకు వేయి కనులు చాలవుగా..!
నీ కిలకిల మధువులనే గెలిచేయగ వస్తున్నా..!
ఎడ్లబండి తోలుతున్న ఓ గడుసరి సుకుమారీ..!
నా మరదలు నీవేనని అల్లేయగ వస్తున్నా..!
తరగని పదహారే నీ ప్రాయం ఏ నాడైనా..!
సంక్రాంతి సంబరాలు అందివ్వగ వస్తున్నా..!
పసిడిపైరు పరికిణీకి..ఎన్ని కళలు నింపావో..?!
ఈలపాట జోరెంతో..పసిగట్టగ వస్తున్నా..!
ఆ'మాధవ' ఆరాధవు నీవేగా నా సఖియా..!
సెలవలన్ని నీతోనే గడిపేయగ వస్తున్నా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు