579 //
'ఎందుకమ్మ అంత దిగులు'.. అడుగుతున్నది.. మనసు పిచుక..!
'ప్రియుని కొరకు బాధ పడకు'..పలుకుచున్నది..మనసు పిచుక..!
తినుట త్రాగుట లన్ని మరచి..అలా ఎదురు చూడనేల..?!
'రెండు ఆకులు ఆరగించు'..ఇచ్చుచున్నది..మనసు పిచుక..!
నీలినీలి దుపట్టాయె..కొకిలమ్మై పాడుతోంది..!
నీ విరహము తీర్చుకొరకు ..చూచుచున్నది..మనసు పిచుక..!
మోడునంటి గులాబీలు..విరిసెను నీ ప్రేమ తెలుప..!
సొగసువీణ నీ వలపే..పలుకుచున్నది..మనసు పిచుక..!
నవవసంత సౌందర్యపు కోవెలలా తనువునేల..
చింత తగదు కలను కూడ..తెలుపుచున్నది.. మనసు పిచుక..!
ఆ'మాధవ' బృందావని..నీ తలపే ఓ కోమలి..
ఆలకించు నా ముచ్చట..వేడుచున్నది మనసు పిచుక..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు