584..
ప్రతి రాత్రి.. పక్షిలా..వెళ్ళేది ఎవ్వరో..?!
ప్రతి పొద్దు.. మట్టిలా..పుట్టేది ఎవ్వరో..?!
ఎన్నెన్ని జాతరలొ..ప్రతి తలపు మేడలో..?!
అపరంజి శక్తిలా..ఆడేది ఎవ్వరో..!?
కన్నీటి లోయలా..ఆ కడలి కేమేరుక..?!
కలహించు వ్యక్తిలా..కాలేది ఎవ్వరో..!?
ఏ గగన వీధులలొ..ఏ నిధులు దాగెనో..?!
ప్రేమగా గాలిలా..పంచేది ఎవ్వరో..!?
చిగురాకు హృదయాన..వెలిగేటి రాగమా..!
ఓ తోట మాలిలా..కాచేది ఎవ్వరో..!?
'మాధవు'ని రాధయే విశ్వమై విరిసెనా..?!
నిజమౌన తపసిలా..ఉండేది ఎవ్వరో..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు