@..28-01-2016 ముషాయిరా గజల్-02..// 613 //
గంధమే మేనులా..ఇమడడం కష్టమే..!?
తలపునే బొమ్మలా..మలచడం కష్టమే..!?
అందమే శత్రువని..తలచేరు ఎందరో..
నిత్యమౌ పువ్వులా..బ్రతకడం కష్టమే..?!
వెలుగుకే గొడుగులా ఉందిగా నీ చూపు..
బంగారు తీగలా..ఎదగడం కష్టమే..!?
కంటిలో పాపతో..భాషించు నేస్తమా..!
మెరుపుకే దారిలా..మిగలడం కష్టమే..?!
మల్లెతో స్నేహమే..చేయగా నేర్చితే..
నవ్వులో' మెరుపులా..నిండడం కష్టమే..!?
నీడకే నీడగా..తోడుకే తోడుగా..
ఉందువా రా'యిలా..అవ్వడం కష్టమే..!?
బీజమే చినుకుగా..రాలెనా గుండెలో..
మాటకే సాక్షిలా ..మెలగడం కష్టమే..?!
'మాధవా' ప్రేమయే..గానమై కురియగా..
రాగాల కొమ్మలా..పూయడం కష్టమే..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు