Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

551..
ప్రేమసూత్ర రాగాలను ~ పలికించే వీణ నీవు..!
చెలిమిగగన దీపాలను ~ నడిపించే చెలియ నీవు..!
మనిషి జన్మ వరమయ్యిన ~ సంగతినే మరిచానే..
కనిపించని దారాలను ~ కని'పెంచే అమ్మ నీవు..!
నా చూపుల వర్షానికి ~ అమృతమేల నింపేవో..?!
వెతుకులాట నియమాలను ~ వివరించే జాణ నీవు..!
మౌన సుధను అందలేక ~ పరుగులెన్ని పెడతానో..?!
చెక్కిలిండ్ల హాసాలను ~ వడ్డించే చిలుక నీవు..!
నీ అడుగుల సవ్వడులే ~ విను ముచ్చట తోచదేమి..?!
ముగ్గుముగ్గు వర్ణాలను ~ మురిపించే మువ్వ నీవు..!
సంసారపు బుడుగునుండి ~ బయటపడేస్తావు..భలే..!
గొడవ పడే సమయాలను ~ లాలించే గువ్వ నీవు..!
జ్ఞానయమున తీరంలో ~ నిదురించగ నేర్పేవా..!
ఆ'మాధవ' సస్యాలను ~ పండించే రాధ నీవు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

పలికించే వీణ నీవు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.