Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

614..
నీ పదములు ముద్దాడగ..మనసుకెంత ఆరాటమొ..!?
తనను తాను మరవాలని..తనువుకెంత ఆరాటమొ..!?
రాచిలుకల ఊసులలో..ప్రేమమొలక లెన్నెన్నో..??
మౌనసుధల సాక్షియైన..నగవుకెంత ఆరాటమొ..!?
పరిహసించు ఓటములను..ప్రశ్నించే మధువేదో..?
అలల కలల తరగలలో..వలపుకెంత ఆరాటమొ..!?
చెలిమి హంస స'రసములే..సరిగమలకు సిరులవ్వగ..
ప్రాణదీప కిరణమ్ముల..తలపుకెంత ఆరాటమొ..!?
గాలిబుడగ అలిగిందా..వేణువేమి చేసేనట..?!
వీణ తాను కావాలని..సొగసుకెంత ఆరాటమొ..!?
'మాధవు'తో ఐక్యమవగ..భయమెందుకు ఓ రాధా..!
బృందావన వీధులలో..వెలుగుకెంత ఆరాటమొ..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఆరాటమొ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.