202..
కొమ్మలలో కోకిలములు పాడుతున్నదే రాగం..!?
మనస్సులో మయూరములు ఆడుతున్నదే తాళం..?!
జాబిలమ్మ చల్లదనం విరహాగ్నిగ మారెనేల..?!
ఆ చుక్కల కాంతి పూలు కురుస్తున్నదే నాదం..?!
సెలయేరుల గలగలలకు కొండరాళ్ళు వంతలేల..?!
పంట చేల పరవశాలు పంచుతున్నదే సారం..?!
పైరగాలి వల్లెవాటు చెలియ ఎదను మీటునెటుల..?!
పొదరింటి సోయగాలు చిలుకుతున్నదే గానం..!?
నీలి మబ్బు గుంపులలో జరుగు మెరుపు క్రీడలేవి..?!
నవ్వు సాక్షి సంతకాలు నిలుపుతున్నదే హాసం ..?!
మధుపములకు తేనెలొసగు వసంతాల సందడెచట..!?
సంపెంగల తలపులలో నిండుతున్నదే భావం..?!
కమలములే వికసించగ సాయపడే సరసి నీవె..!?
నా అణువుల వేలికొసలు కదుపుతున్నదే జ్ఞానం..?!
మధుర ప్రణయ వీధులలో 'మాధవు'డే రాధ తోడు..?!
ఆ పింఛపు నిజ వలపులు ఒలుకుతున్నదే ధ్యానం..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు