Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

208..
జ్ఞాపకాల వెన్నెలలో.. విహరించే మనసెందుకు..!?
ఆశయాల గగనంలో..రమియించే మనసెందుకు..!?
శ్వాసించే అక్షరాల.. మౌనంలో నిధి ఉన్నది..!!
సాక్షిలాగ జీవించక..కలహించే మనసెందుకు..!?
నీ చుట్టూ ఉన్నదంత.. నీ లోపలి లోకమేను..!!
యుద్ధాలను అభిలషించి..హింసించే మనసెందుకు..!?
నీటి బుడగ పైని వెలుగు.. ఇంద్రధనువు ఎట్లౌనో..!?
తెలిసి కూడ తెలియనటుల..నటియించే మనసెందుకు..!?
జన్మకర్మ చక్రంలో..పుణ్యమెంత చేస్తావో..!?
అదే నీకు బహుమతిలే..విలపించే మనసెందుకు..!?
నీ నేస్తం..'మాధవు'డే..అయ్యేందుకు చూడాలోయ్..!?
ఎవరో 'సరి' లేరంటూ..భావించే మనసెందుకు..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

విహరించే మనసెందుకు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.