214..
ప్రకృతి ఇచ్చే అమృత ఫలములు.. కృతజ్ఞతగా సేవించుదాం..!!
ప్రేమ తోడుగ..స్నేహ భావము.. ఎద పొంగగా జీవించుదాం..!!
దైవమన్నది లేని చోటది లేదు.. సరిగా చూచుటెరిగిన..!!
సత్యమేదో బోధపడగా..చిత్తశుద్ధిగ పరికించుదాం..!!
ఉన్న తావున ఉంది స్వర్గం..నరకమన్నది కోరికేనోయ్..!!
మనసు గొడవను మాన్పుకొనగా ఓ సాక్షిగా శ్వాసించుదాం..!!
మాట మాటకు మాటి మాటికి..తగవులేలా..తెలియకేగా..!!
మాటలాడుతు మౌన సాధన..జరుగు విధముగ గమనించుదాం..!!
రోజుకొకపరి గంట ధ్యానము..ఎంత హాయిని అంద జేయునొ..!!
మందు మాకుల జోలి కెళ్లక..ఆనందముగా భాసించుదాం..!!
వేణు 'మాధవ' మందహాసమె..దివ్య మురళీ గాన మధురిమ..!!
మనసు మనసును..రాధ మనసుగ మార్చుకొనగా తపియించుదాం..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు