215..
తీయని జ్ఞాపకమేదో.. వెంటాడేస్తోంది..!!
తీరని కోరిక ఏదో.. వేటాడేస్తోంది..!!
తలపులు కాల్చే అగ్నిని వెదికే మనసునే..
ఆరని వేదన ఏదో..ఆటాడేస్తోంది..!!
ఆశలు చూస్తే..నీళ్ళే నిండని మబ్బులా..
ఆశయ సాధన ఏదో..మారాడేస్తోంది..!!
మౌనపు తలుపులు తోసుకు వెళ్ళే శక్తేది..!?
కలలను మునిగిందేదో..వాదాడేస్తోంది..!!
ప్రేమకు అర్థం తెలిసేలోగా ఓ చెలీ..
శ్వాసను నిలిపేదేదో..పోరాడేస్తోంది..!!
'మాధవ' హాసం భావాతీతం చూడోయి..!!
సాక్షిని చూపేదేదో..తారాడేస్తోంది..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు