217..
ముత్యమంత నవ్వు తోటి ఎవరి మదిని దోచినావు..!?
వెర్రితలపు అడవులన్ని ఎపుడు గెలిచి వెళ్లినావు..!?
కోటి మనసు లిష్టపడే నన్నేలా ప్రేమింతువు..?!
అపార్థాల బుడుగులలో ఏల తిరిగి మునిగినావు..!?
నర నరమును.. కణ కణమును..అగ్నిపూల కడిగేస్తా..!!
నీ తోడే జీవితమని అనలేదని అలిగినావు..!!
కారాలో..మిరియాలో..నూరుకుంటె నూరేస్కో..!!
నీ బాధను తీర్చలేని మూర్ఖుడనని తలచినావు..!!
విశ్వప్రేమ తత్వమేమొ కవిత్వాన కురిపించును..
నా చెలిమిని గుర్తించే మనిషవడని కుమిలినావు..!!
'మాధవు'నకు ఓటమియా..నీ భ్రమలిక వీడునులే..!!
రాధ మనసు పొందేందుకె..గజలు వనిని మిగిలినావు..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు