220..
'ఆమె' అంటే.. ఆకాశాన మెరుపు తీగని తెలుసుకోవా..!!
'అతను'అంటే.. అసలు తనువే లేని వాడని తెలుసుకోవా..!!
కనుల ముందరి దృశ్య కావ్యం..భ్రమావరణం ధర్మ క్షేత్రం..!!
'నేను'అంటే.. 'నేను, నువ్వు'ల.. పూల తోటని తెలుసుకోవా..!!
ఆగమంటే ఆగకుంటే.. ఇచట అన్నీ ఆగమే మరి..!!
'ఆశ'అంటే..'ఆధి శతము'.. వీడ వలెనని తెలుసుకోవా..!!
కలల చిత్రములన్ని చూడగ.. కాలమెవ్వరి కడ్డుపడదోయ్..!!
'నేత్ర'మంటే.. 'నేను *త్రయము'కు.. అద్దమేనని తెలుసుకోవా..!!
మనసు చేసే మాయ శిల్పమె.. మనిషి జన్మకు కర్మ బంధము..!!
'మనువు' అంటే..'మనసు నువ్వు'ల కలయికేనని తెలుసుకోవా..!!
'మాధవు'నకే మౌన వేణువు..అయినదే కద రాధ హృదయము..!!
'భూమి' అంటే..'భూత మిశ్రము' పంచ తనువని తెలుసుకోవా..!!
*నేను త్రయము - తనువు,మనసు,ఆత్మ
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు