221..
నీవు గాక మరి ఎవ్వరు..నా మనసును దోచ గలరు..?!
ఎవరు ఎలా మాటలలో..నా ప్రేమను తూచ గలరు..?!
బరువు లేని తలపులెలా వికసించునొ చెప్పాలా..!!
ఏ పూవుల పరిమళాలు..పట్టి ఎవరు దాచ గలరు..?!
కాల మెవరి గుండెలలో.. ఏ సూదులు గుచ్చుతోంది..!?
ఏ దారం సాయంతో..ఆ చిగ్రుగులు కుట్ట గలరు..?!
మోహమసలు.. మసలుతోంది చిలిపితనపు వనంలోనె..!!
రాల లేని తోట పూలు..ఎవరెప్పుడు తెంచ గలరు..?!
నీ పూజను చేయలేక..నిదుర మత్తు వీడలేక..!!
లంపటముల నాటకమున..ఎటుల నిన్ను తెలియ గలరు..?!
నవనీతము..అది సరియా..! 'మాధవు'డా..నీ చూపుకు..!!
ఏ నాటికి ఈ మనుజులు..నీ గీతను మునుగ గలరు..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు