222..
అసలు ఉండలేను.. చెలీ.. నిన్ను చూడకుండా..!!
క్షణం ఆగలేను.. చెలీ..నిన్ను చూడకుండా..!!
ఎంత అల్లరి చూపు నీది..కలనైనా మరపు రాదు..!!
ముద్ద మ్రింగలేను.. చెలీ..నిన్ను చూడకుండా..!!
నీ ఆటలు నీ పాటలు..మదిని వీడలేవు కదా..!!
మనసు నిలుపలేను.. చెలీ..నిన్ను చూడకుండా..!!
ఎలా మనం కలిసామో..ఒక్కటైన భావాలతో..!!
అడుగు కదపలేను.. చెలీ..నిన్ను చూడకుండా..!!
చిత్రమేమి జరుగుతోందో..నా హృదయపు కోవెలలో..!!
పెదవి మెదపలేను.. చెలీ..నిన్ను చూడకుండా..!!
ఈ వసంత బృందావని..నీవు కదా 'మాధవు'నకు..!!
ఇల్లు చేరలేను.. చెలీ..నిన్ను చూడకుండా..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు