223..
మనసుకు తలుపులు లేవని తెలిసెను నీ దయతోనే..!!
మాటకు చోటులు లేవని తెలిసెను నీ దయతోనే..!!
భావన చక్కని అద్దం.. చూపిన చెలియవు నీవే..!!
బాధకు మాటలు లేవని తెలిసెను నీ దయతోనే..!!
వసంత మెక్కడ దాగెను..తియ్యని నీ చూపులలోనేగా..!!
నవ్వుకు నెప్పులు లేవని తెలిసెను నీ దయతోనే..!!
'ఎవరికి ఎవరీ లోకంలో'.. అనుకో వలదన్నావే..!!
తలపుకు చిరుగులు లేవని తెలిసెను నీ దయతోనే..!!
ఇక్కడి గొడవలు ఎందుకు అనటం భావ్యం కాదుగా..!!
నిప్పుకు గొడుగులు లేవని తెలిసెను నీ దయతోనే..!!
మధురత రాధా 'మాధవ' సంగమ తీర్థం కాదా..!!
ప్రేమకు హద్దులు లేవని తెలిసెను నీ దయతోనే..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు