228..
నువు వెళ్ళిన దారన్నది.. ఖచ్చితంగ తెలుస్తోంది..!!
తిరిగి ఇలా రావన్నది.. ఖచ్చితంగ తెలుస్తోంది..!!
నీ అడుగుల జాడలలో కాంతి పూల రాశులహో..!!
నేను ఏర లేనన్నది..ఖచ్చితంగ తెలుస్తోంది..!!
ఆ విరులను మాల కట్ట దారమసలు ఉండదులే..!!
నీ మైత్రీ మహిమన్నది..ఖచ్చితంగ తెలుస్తోంది..!!
నా శ్వాసల తలపులలో ఎన్ని మధుర పరిమళాలు..!!
నీ చూపుల కరుణన్నది..ఖచ్చితంగ తెలుస్తోంది..!!
కలహంసల రెక్కలపై ఎన్ని సాక్షి సంతకాలు..!!
నీ హృదయపు సొగసన్నది..ఖచ్చితంగ తెలుస్తోంది..!!
ఓ రాధా..! 'మాధవు'డే లేడు కదా..నీవు లేక..!!
నీ తియ్యని ప్రేమన్నది..ఖచ్చితంగ తెలుస్తోంది..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు