Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

230..
బృందావని అందాలను దిద్దుతోంది నా మధుమతి..!!
తేనియలకు మధురిమలను నింపుతోంది నా మధుమతి..!!
అణువణువున కనుపాపల..కొలువు తీరి ఉన్నదిగా..!!
నా నిద్దుర మెలకువలను నడుపుతోంది నా మధుమతి..!!
గుండె లయల నాదాలకు వేదమైన నా సఖియే..!!
అక్షరాల కనురెప్పలు మీటుతొంది నా మధుమతి..!!
అంతరంగ చిత్రాలకు అద్దమేల పట్టేనో..?!
ఆలోచన లోచనాలు నిలుపుతోంది నా మధుమతి..!!
రణరంగము తనువనుకొని పారిపోవ పని లేదిక..!!
ఈ క్షణముల సౌభాగ్యము ఒలుకుతోంది నా మధుమతి..!!
'మాధవు'నకు ప్రతిరూపము రాధ మనసులో దాగెను..!!
నా శ్వాసకు ప్రాణముగా ఒదుగుతోంది నా మధుమతి..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నా మధుమతి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.