234..
ప్రశంసలకు పొంగిపోతు.. ఉండేదే అహం సుమా..!!
తనను తాను మరచిపోతు.. ఉండేదే అహం సుమా..!!
ఎవరి తప్పు లేదు ఇచట..ఎంచుటయే తప్పు చూడు..!!
నవ్వు ముళ్ళు గుచ్చిపోతు.. ఉండేదే అహం సుమా..!!
తెలియజెప్ప నొచ్చుకోకు..అనుభవాల పెదవి విప్పు..!!
మాట ఇచ్చి తప్పిపొతు.. ఉండేదే అహం సుమా..!!
కిరీటాలు కోరుకుంటు.. అలసిపోవు మానసమా..!!
కోరికలతొ మరిగిపోతు ఉండేదే అహం సుమా..!!
చూపులోతు తెలియలేక.. చూచేవే పైపైనే..!!
'నేను' తోటి వేగిపోతు.. ఉండేదే అహం సుమా..!!
మంచి చెడుల ఘర్షణలో.. మునిగిపోడు 'మాధవుడు'..!!
సాక్షి నుండి పారిపోతు.. ఉండేదే అహం సుమా..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు