తెలుగు భాషకు వందనం by మురళీ జాదవ్ (CRTL కవితల పోటీ 2021)
మురళీ జాదవ్
తెలుగు భాషకు వందనం
*తెలుగు భాషకు వందనం*
నా భాష బెల్లమేసి అండిన అరిసే
ఆకలి తీర్చే అన్నం ఆవకాయ నెయ్యి.. నా భాష
ఎసరు పోసి కొసరు కొసరుగా కలుపుతు
కాచిన అంబలి నా తెలుగుభాష
జుర్రుకునే జుంటి తేనె తీపిభరితమే నా తెలుగు భాష
అమ్మతల్లి అక్కచెల్లి వావివరసల వాకిలి నా తెలుగు భాష
ప్రేమ పలుకుతో తేనెలోలుకు ఆప్యాయత పందిరిపై అల్లుకున్న మల్లేతీగ నా తెలుగు భాష
వాకిలుడ్చి ఇల్లు అలికి రంగు రంగుల రంగవళితో ముచ్చటించి మురిసిపోయే నా తెలుగు భాష
తంబుర తంతుల నాదం నా తెలుగు
ఇంపు సొంపుల స్వరం నా తెలుగు
జానపదాలకు ప్రాణం నా తెలుగు
శృతిలయ ఓంకారం నా తెలుగు
నా తెలుగు..నిండు ప్రేమల ధ్వని,
నా తెలుగు..తరాలు తరగని గని
రాయలు మెచ్చిన తెలుగు రాజ్యమేలిన తెలుగు
కోట్ల కవుల నాల్కెపైన నాట్యమాడిన తెలుగు
ఆది కవి నన్నయ్య కలమున
పోతన్న పోలమున పండిన ధాన్యం నా తెలుగు
తెనాలి, అలసాని, కందుకూరి,దూవ్వురి, చిలుకూరి,దూర్జటి,వెమన,గురుజాడల జాడ తెలిపిన తెలుగు
కవయిత్రి మొల్ల శ్రీనాథ,సినారే ,విశ్వనాథ ,జాషువా ,కాళోజి కలలుగన్న కావ్యాం నా తెలుగు
పిడుగై పలికిన గిడుగు వాక్యాల గొడుగు నా తెలుగు