Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

341..
మనసు కన్న చిన్ని పాప లేదు.. కదా నేస్తమా..!
తోడు కన్నకంటి పాప లేదు కదా.. నేస్తమా..!
నీ విరహపు వేడి చూడ గ్రీష్మాలకు తెలియునా..!?
చినుకు కన్న చిట్టి పాప లేదు కదా..నేస్తమా..!
మబ్బు కన్నె గుండె లయలు మీటుచున్న జాణవే.. 
మెరుపు కన్న వెర్రి పాప లేదు కదా.. నేస్తమా..!
కడలి అలల ఎదలోతుల నిదురించే భావనమా..!
పలుకు కన్న పసిడి పాప లేదు కదా.. నేస్తమా..!
గగనాలను చుంబించే ఆశాలత ఏమనును..?!
మోజు కన్న పిచ్చి పాప లేదు కదా.. నేస్తమా..!
బృందావన వీధులలో ''మాధవుడా'' చూడమ్మా..!
గురువు కన్న మేటి పాప లేదు కదా.. నేస్తమా..!

కదా నేస్తమా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.