శీర్షిక: కవితాక్షరం
అక్షరం నేస్తం కాదు
మది మోయలేని భావాలు
గుండెను పిండేస్తే
నరనరాలను తెంపేస్తే
వచ్చే...ఆవేశమో
ఆక్రందనో
అనుభవసారమో...
అక్షరమై వెల్లివిరుస్తుంది
మనసును తేలిక పరుస్తుంది!
ఆ అక్షరాలలోని గుబాళింపు
ఆకలింపు చేసుకుంటేనే గానీ తెలియదు!
అనుభవాల చెట్టుకు
పూసిన కాయలు రుచి చూస్తేనే గాని తెలియదు
ఒక అక్షరం సమాజాన్ని మార్చలేక పోవచ్చు
అక్షరాల లోని భావాలు ప్రతి మదిని కదిలించ లేకపోవచ్చు
కానీ...ఆలోచన రేకెత్తిస్తుంది
ఒక అక్షరం పదిఅక్షరాలకు నాంది పలుకుతుంది
ప్రతి ఒక్కరిలో ఆలోచనా బీజం నాటుతుంది
ప్రభంజనం సృష్టిస్తుంది
రేపటి రోజుకు బదులుగా మిగులుతుంది
సూన్యంలో కరిగిపోయే కొన్ని సత్యాలకు ఆత్మగా
నిలుస్తుంది!!
-జ్యోతి మువ్వల
26/12/21