నవ్వుతూ కనిపించే వాట్స్అప్ డిపీలు
బోడిగా వెలవెలబోతున్నాయి
కలకలలాడే స్టేటస్లు
నిర్జీవంగా కనిపిస్తున్నాయి
ఆ నవ్వు ముఖం గుర్తొస్తే
గుండెల్లో తడి కళ్ళల్లో చేరుతున్నాయి
రోజు కనిపించిన నేస్తాలు
కనుమరుగై పోతుంటే...
ఆ తియ్యని పలకరింపు
మళ్లీ ఈ జన్మకు లేదని
గుర్తొస్తుంటే...
ఎవరో గొంతు నులిమేస్తున్నట్టు
ఈ గుండె కొట్టుకోవడానికి మొరాయిస్తుంది!
నాకు కూడా శాశ్వతం కాదు ప్రాణం
అన్నీ తెలిసిన ఆగటంలేదు కన్నీటి ప్రవాహం!
ఈ జన్మకు సెలవు అంటున్న బంధాలకు
తుది వీడ్కోలు పలకలేక
శిలను కాలేక అనుక్షణం చితికి పోతున్న...!!
--జ్యోతి మువ్వల
23/5/21