శీర్షిక: చెరువు
మా ఊరి పెద్దమ్మ
పొలాల దాహార్తి తీర్చే గంగమ్మ
చాకలి రేవుగా మార్చినా
గోడ్లను కడిగే స్నానపు గదిగా చేసినా
అమ్మలా ఆదరిస్తుంది!
వెన్నెల వెలుగులో కలువల కన్నుల చేసి
పైరుగాలి తాకిడికి ఉయ్యాలూగుతూ
చిన్న చిన్న చేప పిల్లలతో
పరుగులు పెడుతూ సొగసులు అద్దుకొని
గలగలా నవ్వుతుంటుంది!
దాని ఒడే గర్భగుడి
మనసుకు హాయినిచ్చే మనస్విని
ఎన్నో అనుభవాలను అల్లర్లను
మూటకట్టుకున్న... మాఊరి ఆత్మే అది
ఊరు భారాన్ని మోసే భగీరధి!
ఆ పద్మాకరం నేడు పూజా వ్యర్థాలతో...
ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశ్రమల విసర్జనను
మోసే పాడేగా మారింది!
మన పాపాలు మోసి శాపాలు తగిలాయేమో పూడుకుపోయిన మురుగు గుంతయింది!
జ్యోతి మువ్వల
23/9/21