పరస్త్రీ వ్యామోహంలో ముసిరిన చీకటి
ఆమె ముఖం జాబిలి
వెండివెలుగుల కోమలి
మత్తెక్కించే సొగసరి
మతిపోగొట్టే గడసరి!
అందని దూరాన ఉన్న ద్రాక్ష అది
అందుకే అంత అందం దానికి
మనసును కవ్విస్తుంది
మోహాన్ని రగిలిస్తుంది!
పొందితే చాలు జీవితం ధన్యం అనిపిస్తుంది
వెలుగునిచ్చే ఇంటి దీపం దిగదుడుపే అనిపిస్తుంది!
ఇల్లే ప్రపంచం అనుకునే గృహలక్ష్మి
పతియే ప్రత్యక్ష దైవంగా తలచి
సౌభాగ్యమే సౌందర్యం అనుకునే మహాసాధ్వి!
నీడలా వెంట ఉండే కల్పవృక్షమని మరిచి
క్షణికానందం కోసం ఆశ పడి
అజ్ఞానం చేరి విజ్ఞతను మరిపించింది!
దరి చేరితే గాని తెలియలేదు దాని వైఖరి
పండు వెన్నెలకు అమావాస్య ఆవహించిందని
కారు మబ్బులు కమ్మేస్తూ ఉంటాయని
తెలిసేలోపే చేజారిన జీవితం
పెనుగాలిలా రేగి ఇంటి దీపాన్ని ఆర్పేసింది!
జీవితం చీకటి చుట్టుకున్న ఒంటర్ని చేసి
శూన్యంలోకి నెట్టేసింది !!
- జ్యోతి మువ్వల
బెంగళూరు
21/9/21