ఎంత తుంటరి వాడవోయీ.. చెంత చేరిన చందమామా..!
ఎంత తియ్యని చెలుడవోయీ..చెంత చేరిన చందమామా..!
ముద్దు కోరక కోరకములకు..ముద్దులిచ్చే వన్నెకాడా..!
పచ్చ ధనముల ప్రియుడవోయీ..చెంత చేరిన చందమామా..!
నిన్ను చూడగ ముచ్చటేలే..జగములేలే..హొయలు నీదే..!
పలకరించే విభుడవోయీ..చెంత చేరిన చందమామా..!
మొగ్గ సిగ్గుల తెరలు తీస్తూ..ప్రకృతి కాంతను కాచు దొరవే..!
మధువు నింపే మరుడవోయీ..చెంత చేరిన చందమామా..!
పగటి వన్నెల సొగసులన్నీ..పదిలపరచే ప్రేమ రాజా..!
మేటి కన్నెల గురుడవోయీ..చెంత చేరిన చందమామా..!
పరిమళాలకు పరవశాలను..వెన్నెలలుగా అలదు 'మాధవ'..!
సాటి లేనీ..వరుడవోయీ..చెంత చేరిన చందమామా..!