ఎగిరే గువ్వలు అడుగుతున్నవోయ్..స్వేచ్ఛావాయువు లెక్కడనీ..!?
ఈదే చేపలు అడుగుతున్నవోయ్..స్వచ్చ జలమ్ములు ఎక్కడనీ..?!
''ఝండా ఊంఛా రహే హమారా..సదాకేలియే..''అంటారే..!
ఆ జండాయే అడుగుతున్నదోయ్..సమతా భావము లెక్కడనీ..!?
సరిహద్దులలో ఉద్రిక్తతలూ..మారణ కాండలు నిలిచేనా..?!
కొండా కోనలు అడుగుతున్నవోయ్..శాంతి సౌఖ్యము లెక్కడనీ..?!
అంతే తెలియని ఉగ్రవాదములు..బాంబుల దాడులు..ఆగేనా..?!
అడవి దారులే అడుగుతున్నవోయ్..స్నేహ దీపము లెక్కడనీ..?!
సంబరమెట్లా..?! స్వాతంత్ర్యానికి భయం మంటలే కమ్మేస్తే..!!
వినిర్మలాత్మలు అడుగుతున్నవోయ్..ప్రశాంత చిత్తము లెక్కడనీ..?!
''మాధవ''దేవుడు దిగిరావాలోయ్..నీలో నుండే ఓ..మనిషీ..!
నీ కను పాపలు అడుగుతున్నవోయ్..స్వార్థత్యాగము లెక్కడనీ..!?