306..
బొమ్మమల్లే ఆడుతున్నా ..నేను ఎవరో నాకు తెలియక..!
యంత్రమల్లే పాడుతున్నా ..నేను ఎవరో నాకు తెలియక..!
ఏమి డ్రస్సులు.. ఏమి లోకం..నచ్చకున్నా తప్పదాయే..!
మదిని ఎంతో నలుగుతున్నా..నేను ఎవరో నాకు తెలియక..!
ఎందుకో మరి ఈ ప్రపంచం..నన్ను చులకన చేయుచున్నది..?!
ఎలా చెప్పను..రగులుతున్నా ..నేను ఎవరో నాకు తెలియక..!
పెదవి రంగులు..మేని రంగులు..అసలు నచ్చవు ఏమి చేయను..!
వృత్తి ధర్మము..నెరపుతున్నా..నేను ఎవరో నాకు తెలియక..!
పిచ్చి పూసలు..వెర్రి దండలు..వేసుకొనగా నవ్వు వచ్చును..!
కాలమేదో..గడుపుతున్నా..నేను ఎవరో నాకు తెలియక..!
వేగ రారా ప్రియా 'మాధవ'..వేగలేనుర..నిలువ లేనుర..!
శిలల పొదలా బ్రతుకుతున్నా..నేను ఎవరో నాకు తెలియక..!