307..
తేనె మంచు మల్లెపూల.. వానమల్లె నవ్వు చెలీ..!
పసిడి సన్నజాజి మల్లె..రాగమల్లె నవ్వు చెలీ..!
ఏ పూవుల సొగసులైన ఎంత సిగ్గు పడతాయో..!
ఊరించే పారిజాత..ధారమల్లె నవ్వు చెలీ..!
నెలవంకల సోయగాలు నివ్వెరపడి పోవుకదా..!
కవ్వించే సంపెంగల..సారమల్లె నవ్వు చెలీ..!
శిరీషములు పరిమళించ వేచినాయి చిత్రమేను..!
ఎదురొచ్చే మెరుపు తీగ..మౌనమల్లె.. నవ్వు చెలీ..!
పరవశించు మయూరాల పదములాగి పోయినాయి..!
స్పందించే..అంతరంగ..ధ్యానమల్లె.. నవ్వు చెలీ..!
రాచిలుకలు సరి క్రొత్తగ..మూగబోవ నేర్చెనట..!
అనుక్షణం అక్షరాల..నాదమల్లె..నవ్వు చెలీ..!
'మాధవు'నకు మధురమైన రసవీణయె నీవు ప్రియా..!
స్వరములకే మూలమైన..హాసమల్లె..నవ్వు చెలీ..!!