Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

317..
నిత్య స్నేహ వాహినులను సృష్టించే కలం నీవు..!
సత్య ప్రేమ వారథులను నిర్మించే కలం నీవు..!
తలపు తలపు మేఘ నిధికి మెరుపు ధార పొదిగి..
అనురాగపు తేనియలను కురిపించే కలం నీవు..!
కాంతి పూల మది వీణలు మీటు రాగ ధనువౌతూ..
హృదయ గగన తీరాలను దాటించే కలం నీవు..!
మధుర మందహాసాలను సస్యాలుగ వెలయిస్తూ..
ఆత్మీయత క్షేత్రాలను పండించే కలం నీవు..!
విప్లవాత్మ బీజాలను చల్లుతూనె ప్రశాంతమౌ..
విశ్వ శాంతి గీతాలను అందించే కలం నీవు..!
మాధవునికి ఆ రాధకు..నడుమ శ్వాస వేణువౌచు..
అమృత ప్రణయ వేదాలను వెలిగించే కలం నీవు..!

కలం నీవు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.