Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

319..
క్షణాల రెప్పల పాటకు.. సాక్షులు మనమే..!
కణాల స్వరాల ఆటకు.. సాక్షులు మనమే..!
వెలిగే మైత్రీ వేదం..వినిపిద్దామోయ్..!
మౌనపు కోవెల మాటకు..సాక్షులు మనమే..!
ఇజాల రెక్కలు తెగిపడుతుంటే..చూద్దాం..!
నిజాల పువ్వుల తోటకు..సాక్షులు మనమే..!
తెలిసీ తెలియని తనాల ముచ్చట లేదోయ్..!
జన్మల మరపుల కోటకు..సాక్షులు మనమే..!
వెళ్ళే వారూ..వచ్చే వారూ..లేరోయ్..!
పరుగిడు హంసల బాటకు..సాక్షులు మనమే..!
రాధా 'మాధవ'..క్రీడావనియే..మనసోయ్..!
కోర్కెల వెన్నెల ఊటకు..సాక్షులు మనమే..!

సాక్షులు మనమే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.