Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

324..
కలలుగనే మేఘత్వం చూస్తున్నా నీ కన్నుల..!
మెరుపు రథం శుద్ధత్వం చూస్తున్నా నీ కన్నుల..!
చిత్రమైన కావ్యాలకు పుట్టిల్లది నీ తలపే..!
కవ్వించే రాగత్వం చూస్తున్నా నీ కన్నుల..!
మనసు పొరలు కరిగించీ నను మాయం చేస్తావే..!
పాలించే గగనత్వం చూస్తున్నా నీ కన్నుల..!
నన్ను నీవు మనువాడిన వేళ ఎంత అద్భుతమో..!
లాలించే మాతృత్వం చూస్తున్నా నీ కన్నుల..!
కనులు మూసి మూయగనే మరపించే నెచ్చెలివే..!
ప్రవహించే స్నేహత్వం చూస్తున్నా నీ కన్నుల..!
ఆ 'మాధవ' వేణు రవపు సాక్షియైన రాధమ్మా..!
ఆ వెన్నెల స్నిగ్ధత్వం చూస్తున్నా నీ కన్నుల..!

నీ కన్నుల
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.