Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

325..
మనసే దోచిన.. గులాబి నీవా..!
మధువుగ మిగిలిన.. గులాబి నీవా..!
అద్భుత పరిమళ రాశివి..చెలియా..!
నా మది నిలచిన..గులాబి నీవా..!
విరహపు జ్వాలను చల్లార్చేవా..!
మనసా వలచిన..గులాబి నీవా..!
జన్మల గొడవలు మాన్పే సఖియా..!
తోటను దాటిన.. గులాబి నీవా..!
చిరునగవులకే..శ్వాసగ వెలిగే..
శక్తిని మించిన..గులాబి నీవా..!
'మాధవ' పలుకై..రాధా కులుకై..
చిలుకగ మారిన..గులాబి నీవా..!

గులాబి నీవా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.