Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

331..
అలా ఎగిరి పడుతుంటే ఎంత హాయి 'అలా అలా'..!
కలల దారి విడుతుంటే ఎంత హాయి 'అలా అలా'..!
కొండల మది తోలిచేవే..కోనలలో ఒదిగేవే..!
కన్నె హృదిని తడుతుంటే..ఎంత హాయి 'అలా అలా'..!
సరదాలకు పరదాలను తొలగించే..స్వర రాణీ..!
తలపు సుడిని చుడుతుంటే..ఎంత హాయి 'అలా అలా'..!
గల గల గల సవ్వడులకు గతులు నేర్పు జాణవులే..!
వలపు సడిని కడుతుంటే..ఎంత హాయి 'అలా అలా'..!
అలా..! అలా పలకరిస్తు పులకింప జేస్తావే..!
గుండె తడిని ఒడుతుంటే..ఎంత హాయి 'అలా అలా'..!
రాధతోటి 'మాధవుడే'..ముచ్చటింప సాక్షివిలే..!
నువు అల్లరి పెడుతుంటే..ఎంత హాయి 'అలా అలా'..!

ఎంత హాయి 'అలా అలా
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.