Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

335..
విశ్వ వీణ నాదాలను..అనువాదం చేస్తావా..!
నిత్య ప్రేమ వేదాలను..అనువాదం చేస్తావా..!
నిన్ను నీవు తెలుసుకునే సాధనలో మునిగేసెయ్..!
మాట మాటు మౌనాలను..అనువాదం చేస్తావా..!
సాహసమే ఊపిరనే ఊసునసలు మరువకోయ్..!
గుండె లయల హాసాలను..అనువాదం చేస్తావా..!
అద్దమంటి జీవితాన్ని అనుక్షణం గమనించెయ్..!
మనసు పొరల మోహాలను..అనువాదం చేస్తావా..!
పట్టి లాగు వలపులతో..కలహాలను మానాలోయ్..!
సుఖ జీవన మర్మాలను..అనువాదం చేస్తావా..!
రాధ కొలువుకూటంలో..'మాధవు'డే సాక్షి చూడు..!
పసిడి హంస సత్యాలను..అనువాదం చేస్తావా..!

అనువాదం చేస్తావా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.