Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

342..
తలపులలో అవిటితనం కాల్చటమే.. తెలియాలోయ్..!
చూపులలో స్నేహధనం కురియటమే.. తెలియాలోయ్..!
మాటలతో యుద్ధాలవి..ముగిసేందుకు ఉపాయమా..!
మౌనంలో మునుగు దారి పట్టటమే..తెలియాలోయ్..!
అక్షరాల గంధంతో మాన్పవచ్చు గాయాలను..!
ప్రేమ గుండె గొంతుకతో పలకటమే..తెలియాలోయ్..!
శాంతి గగన విశ్రాంతిని అనుభవించ వేడుకైతె..
చిరు నవ్వులు ఎద పెదవుల నిలపటమే..తెలియాలోయ్..!
శ్వాస మాటు పసిడి పూల పరిమళాలు అందాలా..!
కనులు మూసి లోలోపల చూడటమే.. తెలియాలోయ్..!
ఆ'రాధా బృందావన సీమ ఎక్కడున్నదోయి..?!
ఆ''మాధవ'' హృదయంగా వెలగటమే..తెలియాలోయ్..!

తెలియాలోయ్
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.