Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

346..
చూడ మనసే.. మహా చక్కని.. పూల తోటోయ్ మనిషికి..!
తెలియ 'నేనే'.. పట్టి వీడని.. పూల తోటోయ్ మనిషికి..!
కోర్కె కన్నా..అగ్నిగుండం.. లేదు వెతుకగ జగతిలో..!
తలపు కోటయె..అసలు వాడని..పూల తోటోయ్ మనిషికి..!
మబ్బు మదిలో.. నిదురపోయే..మెరుపు కన్నెలు మురియగ..!
మంచు బిందువె.. మాటలాడని..పూల తోటోయ్ మనిషికి..!
ఇంద్రధనువున..వర్ణ చంద్రిక..అంద చందము..చిత్రము..!
తనువు బంధమె..విరిసి విరియని..పూల తోటోయ్ మనిషికి..!
స్నేహ గంధం.. పంచు అక్షర రాజ్యమేదో..చేరగ..!
మోహ రాశియె..కదలనివ్వని..పూల తోటోయ్ మనిషికి..!
ప్రేమ వేణువు..మీటు 'మాధవ' తత్వమేమో అందగ..!
రాధ వలపే..నిద్దురెరుగని..పూల తోటోయ్ మనిషికి..!

పూల తోటోయ్ మనిషికి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.