Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

350..
మన ''తెలుగు గజల్'' 'గ్రూప్ పక్షాన ఆత్మీయులు గజల్ మాస్ట్రో..డా..గజల్ శ్రీనివాస్ గారికి విజయవాడలో 13-09-2015 న నోబుల్ పర్సనాలిటీ అవార్డ్ సత్కారం జరుగుతున్న సందర్భంగా.. ప్రత్యేక 
శుభాభినందనచందనములతో..
తెలుగు గజల్ కంజిరాకు నాదమైన..శ్రీనివాస..!
తెలుగు గజల్ గుండె లయకు ప్రాణమైన..శ్రీనివాస..!
తెలుగు నేల కణ కణమున నిండెనోయి నీదు ప్రేమ..!
మైత్రి నిధిని అందించే రాగమైన..శ్రీనివాస..!
'గజల్ గాన గంధర్వా'' నీకు నీవె సాటి కదా..!
వరియించిన బిరుదులకే..వేదమైన..శ్రీనివాస..!
'అవార్డులు'..'రికార్డులు'.. వేచియుండు నీ వాకిట..!
మన భారత సంస్కృతికే..అద్దమైన.. శ్రీనివాస..!
జీవనమది 'సురేఖతో'..'సంస్కృతి'గా పరిమళించె..!
విశ్వా శాంతి బావుటాకు స్థంభమైన..శ్రీనివాస..!
'మాధవు'నకు తరమౌనే నీ చెలిమిని వర్ణించగ..!
సంకీర్తన మాటు శ్వాస దీపమైన..శ్రీనివాస..!

ప్రాణమైన..శ్రీనివాస
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.