Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

352.
మనసు ఆటను.. తెలుసుకొనుటే.. అసలు ధ్యానం చూడు సరిగా..!
ప్రేమ తోటను..ఆడుకొనుటే..అసలు ధ్యానం చూడు సరిగా..!

నిప్పు ఎంచని జాతి మతములు..నీకు ఎందుకు పనికి వచ్చును..?!
నీటి మూటను..గెలుచుకొనుటే..అసలు ధ్యానం చూడు సరిగా..!

విసుగు,విరహము,వేదనుండవు..కలలు మాయం..శాంతి మిగులును..!
శ్వాస కోటను మసలుకొనుటే..అసలు ధ్యానం చూడు సరిగా..!

కోపమంతా ధూపమల్లే..తేలిపోగా సమయమివ్వోయ్..!
సాక్షి ఇంటను చేరుకొనుటే..అసలు ధ్యానం చూడు సరిగా..!

పాల పుంతల వీధులన్నీ..దాటి వెళ్లగ ఇష్టమైతే..
తగిన బాటను నడచుకొనుటే..అసలు ధ్యానం చూడు సరిగా..!

రాలు పూవుల భాష కూడా తెలియు చక్కగ కోరుకుంటే..!
పక్షి పాటను అందుకొనుటే..అసలు ధ్యానం చూడు సరిగా..!

పెళ్లి పెద్దలు అన్ని జీవులు..విశ్వమందున సత్యమిదియే..!
ప్రకృతి పీటను..కాచుకొనుటే..అసలు ధ్యానం చూడు సరిగా..!

అసలు ధ్యానం చూడు సరిగా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.