Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

355..
నీవు నేను కలసి సాగ.. పడుతున్నది తుంపర..!
మన ప్రేమకు తోడు కాగ.. పడుతున్నది తుంపర..!
ఒకే గొడుగు చాలట లే..ఒక జంటకు సఖియా..!
పచ్చ నైన ఊయలూగ..పడుతున్నది తుంపర..!
పలకరించు పొద పొదలో..క్రొత్తదనమదేమో..
చిగురు ఎదల సుధలు పొంగ..పడుతున్నది తుంపర..!
ఈ వనమున..ఈ రేయికి విరహ బాధ మాన్పగ..!
ప్రతి కణమున మరులూరగ..పడుతున్నది తుంపర..!
పెళ్లి నాటి ప్రమాణాలు మరువకుండ 'మాధవ'..!
మంత్రాక్షర సరస ధునిగ.. పడుతున్నది తుంపర..!
మూడు ముళ్ళు ఏడడుగులు..నడిపించిన దారిగ..! 
పుష్పాక్షతలవి చల్లగ..పడుతున్నది తుంపర..!

తుంపర
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.