Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

356..
ఒకే మురళి మన నడుమన.. ఒకే శ్వాస మన దాయెనె..!
చిత్రముగా స్వరములాన..ఒకే ధ్యాస మన దాయెనె..!
ఆ మయూరి కనులలోన..నిండు వలపు సుధలు చూడు..!
సప్త వర్ణ దీప్తి లోన..నిండు పాట మనదాయెనె..!
నెమలి కన్నులెన్నున్నా..నీ కన్నుల నేనేగా..!
ప్రేమ యజ్ఞ వాటి ప్రాణ..సాక్షి చిలుక మన దాయెనె..!
నీలి వర్ణ రాగాలకు మోవినొసగు వాసుదేవ..!
నీ నగవుకు సాటియైన..మైత్రి వాన మనదాయెనె..!
కలలు గనే రెప్పలలో..నాట్యమాడు నెరజాణా..!
నీ అందెల రవళి లోన..జీవ ధార మన దాయెనె..!
జగన్మోహ నా'మాధవ'..!నీ తియ్యని గానములో..!
అంతులేని ధ్యానమ్మున..దైవ భాష మన దాయెనె..!

జీవ ధార మన దాయెనె
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.