Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

358..
***ప్రముఖ చిత్రకారులు.. Chandra Arts గారికి ప్రత్యేక ధన్యవాదములతో..!
చిరునవ్వుల చిరునామా..ఉన్నది మరి.. నీ చూపున..!
మరు మల్లెల..సోయగమా..ఉన్నది మరి.. నీ మోమున..!
దేవ కన్య లెందరినో మాయచేసి వచ్చినావు..!
పారిజాత..మార్దవమా..ఉన్నది మరి..నీ పలుకున..!
నటన లోన సహజత్వము..తొంగిచూచు..మరువలేము..!
శ్రీ చందన..పరిమళమా..ఉన్నది మరి..నీ కులుకున..!
జీవనమున కష్టాలను కన్నీళ్లను మోసినావు..!
విషాదాల..సుమవనమా..ఉన్నది మరి..నీ మనమున..!
మా'మాయా బజారు'లో..శశిరేఖగ మిగిలినావు..!
ఆ మెరుపుల భావనమా..ఉన్నది మరి నీ విరుపున..!
మహా తల్లి సావిత్రీ..ఆ 'మాధవ' ప్రియ పుత్రీ..!
ఆ వెన్నెల యవ్వనమా..ఉన్నది మరి..నీ తలపున..!

ఉన్నది మరి..నీ తలపున
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.