Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

362..
ఆత్మీయ మిత్రులు మన గౌరవ అడ్మిన్ శ్రీ.Rvss Srinivas గారికి అంకితం ..
చక్కని వెన్నెల వీడని గజలై చిక్కెను చూడు..!
బంగారు భావన తానై ఎదలో..పొంగెను చూడు..!
యవ్వన వీణై స్వరాల మధువులు కురిసే దారిని..
క్షణాల కనులకు తియ్యని వరముగ చూపెను చూడు..!
పలుకులకందని పరవశమేదో..లోలో నింపుచు..
తెలియని ఆశయ రథమును హాయిగ కదిపెను చూడు..!
కన్నుల ముందరి బృందావనిగా పలికిన చాలదు..
చిక్కని మెరుపుల వానై అక్షర సీమగ విరిసెను చూడు..!
పంచమి పంచన చక్కెర మొలకై నవ్వులు రువ్వుచు..
జాబిలి కలలో.. ఏదో గుబులును రేపెను చూడు..!
'మాధవ' రాధై..మౌనపు నెచ్చెలి సాక్షిగ నిలచి..
హంసల వీధుల హరివిలు రాశిగ మిగిలెను చూడు..!

చిక్కెను చూడు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.