Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

363..
బిడ్డ పుట్టుక స్వాగతించే..తల్లి మనసుకు వందనం..!
నాన్నతనమును గౌరవించే..తండ్రి మనసుకు వందనం..!
తెలివి లేకే జరుగుతున్నవి..గొడవలెన్నో..నేస్తమా..!
చెలిమి ధనమును తెలిసి పంచే..కలిమి మనసుకు వందనం..!
ప్రకృతి కొలువున అణువు అణువున..ప్రేమ యజ్ఞమె చూడగా..
పువ్వు మాదిరి పరిమళించే..సరసి మనసుకు వందనం..!
అంది వచ్చిన బహుమతైన..జన్మ మూలము తెలియగా..
కురియు మబ్బై అధిగమించే..మౌని మనసుకు వందనం..!
సందియములతొ బ్రతుకునీడ్చుచు..మదిని కుందుట మానగా..
మొలక గింజై పులకరించే.. మట్టి మనసుకు వందనం..!
'మాధవాంశ'గ పుట్టి కూడా మరచినావది పట్టగా..
వెలుగు నిధియై ప్రకాశించే..సాక్షి మనసుకు వందనం..!

మనసుకు వందనం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.