Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

 గజల్ 3633.


పాతరోగం కొత్తరూపం..ఎత్తుతూనే ఉంటుంది..!

భయం'కరోన' మనిషిఅహం..త్రాగుతూనే ఉంటుంది..!


అప్రమత్తత ఊహకందే..లోపుగానే మరణమోయ్.. 

పరిశోధనకెన్ని సవాళ్ళనొ..విసురుతూనే ఉంటుంది..!


ఆక్రమించే గుణం దేనికి..పనికివచ్చునొ తెలిసెనా.. 

చిన్నికణమే విశ్వరూపం..చాటుతూనే ఉంటుంది..!


నీతిశాస్త్రం పాఠమల్లే..చెప్పుటెంతో తేలికే.. 

లోనిదీపం గురువు తానై..పాడుతూనే ఉంటుంది..!


మంచిముచ్చట వినేసంగతి..దివ్యవరమే నేస్తమా..

నీవు-నేనను బేధభావం..గుచ్చుతూనే ఉంటుంది..!


మాధవాద్భుత గజల్ సీమన..విహరించుటే భాగ్యమా..

చెలిమివెన్నెల పరిమళాలవి..పంచుతూనే ఉంటుంది..!

పంచుతూనే ఉంటుంది..!
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.