Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

3634..గజల్


మనసునుండి విసిరేమా..మరణోజ్వల ప్రియ'శార్వరి'..! 

'కరోనాకు' పాడేమా..రాగోజ్వల ప్రియ'శార్వరి'..! 


మన సంస్కృతి సంప్రదాయ..విజ్ఞానం అమోఘమే.. 

చెలిమివిలువ చాటేమా..స్నేహోజ్వల ప్రియ'శార్వరి'..! 


ఏది ఎలా చేయాలో..ఎప్పుడెలా నడవాలో.. 

తెలిసి సరిగ పలికేమా..ప్రేమోజ్వల ప్రియ'శార్వరి'..! 


చీకటింటి వెన్నెలయే..అసలు మధువు గమనిస్తే.. 

మోహమేదొ వదిలేమా..మహిమోజ్వల ప్రియ'శార్వరి'..!


ఆహారము లాహార్యము..లన్నీ మరి ప్రియములేగ..

ప్రణయసుధలు గ్రోలేమా..ప్రణవోజ్వల ప్రియ'శార్వరి'..!


జగమంతా మాధవానంద చైతన్యనిధియేగా..

హంసధ్వని నిలిపేమా..మౌనోజ్వల ప్రియ'శార్వరి'..!

ప్రియ'శార్వరి
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.